
ఇవాళ సాయంత్రం వరకు తీవ్ర వాయుగుండం ప్రభావం
AP: తీవ్ర వాయుగుండం ప్రభావం ఈరోజు సాయంత్రం వరకు ఉంటుందని, ఇది ఉత్తరాంధ్రపై కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. సాయంత్రం తర్వాత ఇది బలహీనపడే అవకాశం ఉంది. బలమైన గాలులు, భారీ వర్షాలతో ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, పొలాల్లో ఉండరాదని అధికారులు సూచించారు.




