రష్యాతో అమెరికా భారీ చమురు ఒప్పందం

14చూసినవారు
రష్యాతో అమెరికా భారీ చమురు ఒప్పందం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించినప్పటికీ, యూటర్న్ తీసుకున్నారు. శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో డీజిల్ కొనుగోళ్లపై అనూహ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. మూడు లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను తక్షణమే సరఫరా చేసేలా ఒప్పందం కుదిరిందని, ఆ తర్వాత దశలవారీగా మరిన్ని సరఫరాలు ఉంటాయని ట్రంప్‌ తెలిపారు. నవంబర్‌ మధ్యంతర ఎన్నికల వేళ అమెరికాలో పెరుగుతున్న ఇంధన ధరలు ఈ నిర్ణయానికి కారణమని పలు కథనాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్