ఇరాన్‌ రహస్య మార్గం.. వెతికిపట్టేందుకు అమెరికా టాస్క్‌ఫోర్స్‌

77చూసినవారు
ఇరాన్‌ రహస్య మార్గం.. వెతికిపట్టేందుకు అమెరికా టాస్క్‌ఫోర్స్‌
ఇరాన్‌ ఆయుధాలు, ఇతర అక్రమ సామగ్రిని సరిహద్దు దేశాల నుంచి రహస్య భూగర్భ, భూమార్గాల ద్వారా తరలిస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ మార్గాలను గుర్తించేందుకు 20 మంది సభ్యులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. హర్మూజ్‌ జలసంధి సహా ఇరాన్‌ చుట్టుపక్కల ఓడరేవులు, అంతర్జాతీయ జలమార్గాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో వాటిని తప్పించుకునేందుకు ఇరాన్‌ ఈ రహస్య మార్గాలను వినియోగిస్తోందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్