ముంబై ఇండియన్స్ తమ జట్టు కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. జట్టు హెడ్ కోచ్‌గా పొలార్డ్ నియమితులు కాగా, బ్యాటింగ్ కోచ్‌గా రాబిన్ ఉతప్ప, బౌలింగ్ కోచ్‌గా మిచెల్ మెక్లెనాగన్ (న్యూజిలాండ్) బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరంతా గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో ఆటగాళ్లుగా సేవలందించిన వారే కావడం విశేషం. జయవర్ధనే, లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, కార్ల్ హాప్కిన్సన్ వంటి వారు ఇటీవల కోచింగ్ బృందం నుంచి వైదొలగడంతో, ఈ కొత్త
నియామకాలు జరిగాయి.