కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌కు ఓటమి

12చూసినవారు
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌కు ఓటమి
సీనియర్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీకి తన తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో, వైభవ్ సారథ్యంలోని బిహార్ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ 137/9 స్కోరుకే పరిమితమైంది. అనంతరం సౌరాష్ట్ర 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బిహార్ తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 16న రైల్వేస్‌తో ఆడనుంది.

సంబంధిత పోస్ట్