AP: తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ఆన్లైన్లో దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. తొలి రెండు రోజులు డిప్ విధానంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయగా, మిగిలిన 8 రోజులు టోకెన్లు లేకుండానే భక్తులకు అనుమతి ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి 29 వరకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 టికెట్లు కేటాయించనున్నారు. మొత్తం 10 రోజుల్లో 9 లక్షల మంది భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపడుతోంది.