వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల

47చూసినవారు
వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఈ దర్శనాలు జరగనుండగా, భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను ఈ నెల 30న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు సకాలంలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్