
మళ్లీ బతుకుతాడని 4 ఏళ్లుగా తండ్రి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిన మహిళ
భవిష్యత్తులో వైద్య సాంకేతికతతో మనుషులను బతికించవచ్చనే నమ్మకంతో ఓ మహిళ తన తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా రహస్యంగా ఫ్రీజర్‌లో భద్రపరిచిన ఘటన ముంబైలోని మలాడ్‌లో వెలుగుచూసింది. క్యాన్సర్‌తో మరణించిన తండ్రిని తిరిగి బతికించుకోవాలనే ఆశతో, అమెరికాలోని క్రయోనిక్స్ విధానం గురించి తెలుసుకుని, ఒక సంస్థను సంప్రదించింది. మృతదేహాన్ని అమెరికాకు తరలించే వరకు తాత్కాలికంగా స్థానిక క్లినిక్‌లోని ఫ్రీజర్‌లో ఉంచినట్లు, దీనికి నెలకు రూ.1.6 లక్షలు చెల్లిస్తున్నట్లు సదరు మహిళ వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




