పంజాబ్లోని లూథియానా జిల్లా మచ్చివారా సమీపంలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ లారీని మహీంద్రా పికప్ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాతా నైనా దేవిని దర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా స్థానిక వలస కార్మికుల కాలనీకి చెందినవారుగా గుర్తించారు.