
రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో గణేశుడికి అలంకరణ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి సోమవారం రూ.4.50 కోట్ల కరెన్సీ నోట్లతో అద్భుతమైన అలంకరణ చేశారు. గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక అలంకరణ చేపట్టారు. ఈ అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.




