
డివైడర్ను ఢీకొట్టిన ట్రక్కు.. లిక్కర్ బాటిళ్ల కోసం ఎగబడ్డారు (వీడియో)
బిహార్లోని అరేరియాలో ఓ ట్రక్కు డివైడర్ను ఢీకొట్టింది. ఆ ట్రక్కులో లిక్కర్ బాటిళ్లు ఉన్న విషయం స్థానికులకు తెలిసింది. దాంతో లిక్కర్ బాటిళ్ల కోసం మహిళలు, పిల్లలు సహా వందల మంది ఎగబడ్డారు. ట్రక్కు పైకి ఎక్కి లిక్కర్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా, బిహార్లో పదేళ్లుగా మద్యపాన నిషేధం అమల్లో ఉంది. లిక్కర్ అక్రమ రవాణాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




