ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ స్కెరిట్ (93) కన్నుమూశారు. ‘స్టీల్ మాగ్నోలియాస్’, ‘టాప్ గన్’, ‘ఏలియన్’ వంటి ప్రముఖ చిత్రాలతో ఆయన విశేష గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డెట్రాయిట్లో జన్మించిన స్కెరిట్.. నటనారంగంలోకి అడుగుపెట్టడానికి ముందు
అమెరికా వైమానిక దళంలో సేవలందించారు. తన అద్భుత నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.