'రామాయణ'పై VHP అభ్యంతరం.. బ్యాన్ చేయాలని డిమాండ్

3చూసినవారు
'రామాయణ'పై VHP అభ్యంతరం.. బ్యాన్ చేయాలని డిమాండ్
రణ్‌బీర్ కపూర్, యశ్ నటిస్తున్న 'రామాయణ' సినిమాపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రావణుడిని గ్లోరిఫై చేస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆరోపించారు. ఈ సినిమా స్క్రీనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని, సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాక్షస రాజు రావణుడిని గొప్పగా చూపిస్తూ విలువలను దెబ్బతీస్తున్నారని నిర్మాతల తీరుపై ఆయన మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్