VIDEO: కుక్క కాటును నిర్లక్ష్యం చేస్తున్నారా?

3చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్‌కు చెందిన 14 ఏళ్ల సాహిల్‌ కుక్క కాటుకు గురైన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. రెండు నెలల క్రితం కుక్క కరిచినా అతడు నిర్లక్ష్యం చేశాడు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, నీళ్లను చూసి భయపడటం, నోటి నుంచి లాలాజలం కారడం వంటి రేబిస్‌ లక్షణాలు కనిపించాయి. వైద్యులు చికిత్స అందించినా బాలుడిని కాపాడలేకపోయారు. కుక్క లేదా ఇతర జంతువు కరిచినా, గీరినా వెంటనే గాయాన్ని సబ్బు, ప్రవహించే నీటితో కనీసం 15 నిమిషాలు శుభ్రం చేసి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్