VIDEO: చిన్నారితో వెళ్తున్న తల్లిపై దాడి

3చూసినవారు
గుజరాత్‌లోని వడోదరా బాజ్వా ప్రాంతంలో షాకింగ్ సంఘటన జరిగింది. చిన్న సైకిల్‌పై వెళ్తున్న తన కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ తల్లిపై వీధి ఆవు అకస్మాత్తుగా దాడి చేసింది. బాబు కిందపడిపోవడంతో అతనిని కాపాడేందుకు యత్నించిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆవును తోలేసి, గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. పశువుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్