VIDEO: 50 అడుగుల నీటి ట్యాంక్‌పైకి ఎక్కిన ఎద్దు

11చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని షెయోపూర్ జిల్లా, దడుని గ్రామంలో వింత సంఘటన జరిగింది. 50 అడుగుల ఎత్తున్న ఓవర్ హెడ్ నీటి ట్యాంక్‌పైకి ఎక్కిన ఒక ఎద్దు దాదాపు 36 గంటల పాటు అక్కడే చిక్కుకుపోయింది. అది కిందపడిపోతుందేమోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు పశువైద్యులు ఎద్దుకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేశారు. అనంతరం పంచాయతీ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో క్రేన్ ద్వారా ఎద్దును సురక్షితంగా కిందకు దించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్