ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఆగస్టు 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చాయి. రద్దీగా ఉన్న జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి అక్కడ ఉన్న ప్రజలు, వాహనాలపైకి తీవ్రస్థాయిలో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఢీకొని 15 నుంచి 16 మంది తీవ్రంగా గాయపడగా, ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.