పంజాబ్లోని లూధియానా బహదూర్కే రోడ్డుపై అతివేగంతో వచ్చిన టియాగో ఈవీ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు వరసగా సైకిల్, మోటార్ సైకిల్, ఈ-రిక్షాను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైకర్ గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తుండగా, స్థానికులు అతడిని పట్టుకుని సాలెం తబ్రీ పోలీసులకు అప్పగించారు.