గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో తాజాగా ఓ సింహం పోలీస్ హౌసింగ్ కాంప్లెక్స్‌లోకి చొరబడి కలకలం రేపింది. సముద్ర తీరానికి సమీపంలో ఉన్న పోలీస్ నివాస సముదాయంలో అర్ధరాత్రి వేళ ఆ సింహం దర్జాగా సంచరించింది. జనావాసాల మధ్యకు సింహం రావడంతో అక్కడి నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండానే కొద్దిసేపటి తర్వాత అది తిరిగి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.