VIDEO: పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా

18చూసినవారు
AP: ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండలం పెనపాక వెళ్లే రహదారిపై శుక్రవారం ఉదయం ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 18 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులోంచి సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్