VIDEO: ఉద్యోగిని కిడ్నాప్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా

72చూసినవారు
AP: కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న క్రమంలో టోల్‌గేట్ వద్ద, ఫోన్‌పే ద్వారా టోల్‌చార్జీ చెల్లిస్తున్న వాహన యజమానితో ఘర్షణ పడిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, టోల్‌ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేనెవరినో తెలియదా.. నీ కథ చూస్తాను' అంటూ, 'వాడిని కారులో ఎక్కించండిరా' అని అనుచరులను ఆదేశించి, టోల్‌ప్లాజా ఉద్యోగి మహేష్‌ను కారులో ఎత్తుకెళ్లిపోయారు. విషయం తెలిసిన వెంటనే మహేష్ తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, టోల్‌ప్లాజా ఉద్యోగులు అక్కడికి చేరుకుని ఆందోళన చేయడంతో, ఎమ్మెల్యే అనుచరులు మహేష్‌ను వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్