మహారాష్ట్రలోని నాలసోపారా ఈస్ట్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. రెండు కుటుంబాల మధ్య టెర్రస్పై గ్రిల్ అమర్చే విషయంలో రేగిన వివాదం దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో ఓ మహిళపై తీవ్రస్థాయిలో దాడి జరగ్గా, దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమాచారం అందుకున్న తులంజ్ పోలీసులు రెండు వర్గాల వారిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరికి చట్టపరమైన నోటీసులు జారీ చేశారు.