రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక హోటల్‌పై సీఎస్‌టీ బృందం చేసిన దాడిలో విదేశీ మహిళలతో నడుస్తున్న వ్యభిచార నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఆరుగురు మహిళలను గుర్తించగా, హోటల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరి
వీసా పత్రాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందించడంలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలు దర్యాప్తు ముగిశాక వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.