
అన్ని రాష్ట్రాలూ వందేమాతరాన్ని ఆలపించాల్సిందే: అమిత్ షా
ముంబయిలో జరిగిన 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ పూర్తి వైభవాన్ని పునరుద్ధరించడానికి దాదాపు 80 ఏళ్లు పట్టిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఈ గేయం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో వందేమాతరాన్ని ఆలపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. భారతీయ భాషలు, సంస్కృతిపై అవగాహన పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.





















