విజయ్ ఆంటోనీ హీరోగా ము.మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అప్పకుట్టి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ప్రీతి అస్రానీ హీరోయిన్గా నటించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు కూడా చేపట్టారు. లితాన్య, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విజయ్ ఆంటోనీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.