తమిళనాడు సీఎం, నటుడు విజయ్ తన జీవితంలో ‘లక్కీ ఛార్మ్’ అని స్టార్ హీరోయిన్
సమంత వ్యాఖ్యానించారు. తాజాగా ఓ షోలో
సమంత ఈ వ్యాఖ్యలు చేశారు. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి రావడం, ఈ స్థాయికి ఎదగడం సాధారణమైన విషయం కాదని ఆయనను ప్రశంసించారు. ఆయన కష్టం, పట్టుదల ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. కాగా విజయ్‌తో కలిసి నటించిన 3 సినిమాలు (కత్తి, పోలీసోడు, అదిరింది) బ్లాక్ బస్టర్ అయ్యాయని
సమంత చెప్పుకొచ్చారు.