తెలంగాణలోని విజయ డెయిరీ వినియోగదారులకు ధరల పెరుగుదల రూపంలో మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో స్టాండర్డ్ పాలు విక్రయిస్తున్న విజయ డెయిరీ యాజమాన్యం, వాటి ధరలను స్వల్పంగా సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్ధ లీటరు (500 గ్రాములు) పాల ప్యాకెట్లపై ఒక్కో దానిపై రూపాయి చొప్పున ధరను పెంచుతున్నట్లు డెయిరీ జనరల్ మేనేజర్ అధికారికంగా ప్రకటించారు. ఈ పెంపుదలకు సంబంధించి సవరించిన కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. వినియోగదారులు, ఏజెంట్లు అందరూ ఈ ధరల మార్పును గమనించాలని యాజమాన్యం తమ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.