కొడంగల్ - Kodangal

లగచర్ల గ్రామంలో బస్సు సర్వీస్ ప్రారంభం

లగచర్ల గ్రామంలో బస్సు సర్వీస్ ప్రారంభం

లగచర్ల గ్రామం నుండి హైదరాబాద్‌కు కొత్త బస్సు సర్వీస్‌ను గ్రామ సర్పంచ్ కందూరి వెంకట్ రాములు గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దుద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుటి శేఖర్, దుద్యాల మండలం యాదవ్ సంఘం అధ్యక్షులు కావాలి నర్సిములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావాలి కిష్టయ్య, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు లగచర్ల నుండి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరుతుంది. ప్రజల ప్రయాణ సౌకర్యం కోసం ప్రారంభించిన ఈ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వీడియోలు


వికారాబాద్ జిల్లా