
పట్ట భద్రులు ఓటరుగా నమోదు కావాలి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పూడూరు తహసీల్దార్ విజయ్ కుమార్ సూచించారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ లేదా సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.























