
విద్యార్థులకు రైల్వే శుభవార్త.. రైళ్లలో ఇక ఉచిత ప్రయాణం
రైల్వేశాఖ విద్యార్థుల కోసం ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. బాలురు ఇంటర్ వరకు, బాలికలు డిగ్రీ వరకు పాసింజర్ లేదా ఆర్డినరీ రైళ్లలో సెకండ్ క్లాస్ కోచ్‌లలో ఇంటి నుండి కళాశాల వరకు 150 కి.మీ దూరం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం మంత్లీ సీజన్ టికెట్ పొందాలి. కాలేజీ ఐడీ కార్డుతో రైల్వే కౌంటర్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా విద్యా పర్యటనలు, పోటీ పరీక్షల కోసం ప్రయాణించే విద్యార్థులకు రైల్వేశాఖ నిబంధనల మేరకు టికెట్లపై 50 నుంచి 75 శాతం వరకు రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయి.




