దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ సినిమాపై తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి ప్రశంసలు కురిపించారు. ‘అవతార్’ విజువల్స్ను మించే స్థాయిలో ‘రాకా’లో సన్నివేశాలు ఉంటాయని, భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు.
రాజమౌళి భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినట్లే.. అట్లీ ‘రాకా’తో ఇండస్ట్రీకి మరింత గుర్తింపు తీసుకొస్తారని పేర్కొన్నారు. ఇటీవల చిత్రబృందం ‘37’ పోస్టర్తో పాటు ఓ ప్రత్యేక వీడియో విడుదల చేయడంతో.. త్వరలో గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.