ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరను పెంచిన వొడాఫోన్‌ ఐడియా

15చూసినవారు
ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరను పెంచిన వొడాఫోన్‌ ఐడియా
ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా తన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ధరను పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చింది. గతంలో 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్‌ ధర రూ.859 ఉండగా, దానిని రూ.40 పెంచి రూ.899గా నిర్ణయించింది. ఈ కొత్త ధరలు ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. అయితే, ఈ ధరల పెంపునకు గల కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఈ పెంపుతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

సంబంధిత పోస్ట్