
హైదరాబాద్‌లో దారుణం... భార్య చేతిలో భర్త దారుణ హత్య (VIDEO)
హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు హత్యకు దారితీసింది. భార్య తన భర్త ప్రభాకర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలైన భార్యను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.




