Oct 10, 2026, 09:10 IST/
ఏపీలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
Oct 10, 2026, 09:10 IST
ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ వర్షాలు సంభవిస్తాయి. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో శనివారం తేలికపాటి జల్లులు.. ఆది, సోమవారాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో భారీ వర్షాలు ఉండవు, కానీ మధ్యాహ్నం వేళల్లో ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశముంది.