Sep 04, 2026, 16:09 IST/
బీజేపీలో చేరనున్న కొండా సురేఖ.. క్లారిటీ ఇదే!
Sep 04, 2026, 16:09 IST
TG: మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె కాంగ్రెస్కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ నాయకులు కొట్టిపారేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి రావడం, వరంగల్ ఈస్ట్లో బలమైన నాయకత్వం ఉండటంతో ఇది సాధ్యం కాదని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు కొండా సురేఖ జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కొత్తగా ప్రచారం మొదలైంది.