Sep 09, 2026, 14:09 IST/
ప్రియుడి కోసం మూడు సర్జరీలు.. చివరికి?
Sep 09, 2026, 14:09 IST
యూపీలోని ఆగ్రాలో ప్రేమ కోసం ఒక యువతి తన జీవితాన్ని మార్చుకుంది. ఒక యువకుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడని నమ్మి, మూడు సర్జరీలు చేయించుకుని, మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అయితే, ఆ యువకుడు ఇప్పటికే వివాహితుడని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి షాక్కు గురైంది. ఏడాదిన్నర పాటు ఈ విషయం దాచిపెట్టిన ప్రియుడు, ఇప్పుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు, తన నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.