
వైభవంగా శ్రీ దుర్గా – మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామంలో ఉన్న శ్రీ నవదుర్గ మాత ఆలయంలో గురువారం శ్రీ దుర్గా–మల్లేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహాదేవి మాతాజీ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామాల్లో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్దించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.




























