Sep 22, 2026, 16:09 IST/
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్సే: మంత్రి జూపల్లి
Sep 22, 2026, 16:09 IST
TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీటి పంపకానికి అంగీకరించి ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు 69.5% నీటి వాటా దక్కాలని న్యాయపోరాటం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.