Sep 09, 2026, 13:09 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి: న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పూజ
Sep 09, 2026, 13:09 IST
మొగిలిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ మాట్లాడుతూ, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ అందిస్తే 'నో–గో–టెల్' సూత్రాన్ని పాటించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై 15100కు సమాచారం ఇవ్వాలని కోరారు.