Sep 26, 2026, 14:09 IST/స్టేషన్ గన్ పూర్
స్టేషన్ గన్ పూర్
బోగి లింగయ్య దశదిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే
Sep 26, 2026, 14:09 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టేషన్ గన్ పూర్, వర్ధన్నపేట నియోజకవర్గం, మడికొండకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, వాల్మీకి సంఘం పెద్దమనిషి బోగి లింగయ్య దశదిన కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజ సేవకు లింగయ్య అందించిన సేవలు మరువలేనివని, ఆయన మృతి సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.