
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
డోర్నకల్ మండలం మలైకుంట తండా గ్రామానికి చెందిన ధరంసోత్ అఖిల్ (26) అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. బొడ్రాయి తండాకు టెంట్ సామాను తరలించే క్రమంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయని చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్కు గురై మరణించాడు. మృతునికి భార్య, ఆరు నెలల బాబు ఉన్నారు. యువకుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.























