Oct 11, 2026, 12:10 IST/
మాజీ మంత్రి గంగుల కమలాకర్ అరెస్ట్
Oct 11, 2026, 12:10 IST
TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అరెస్ట్ అయ్యారు. కరీంనగర్ రూరల్, మండల పరిధిలోని దుర్షేడ్ గ్రామంలో కరెంట్ కోతలపై రైతులతో కలిసి గంగుల ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ దుర్షేడ్ రహదారిపై ఆందోళనకు దిగారు. కరెంట్ మోటార్లు, బతుకమ్మతో నిరసన చేస్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గంగులతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.