Oct 16, 2026, 15:10 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
జిల్లా కోర్టులో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Oct 16, 2026, 15:10 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు హనుమకొండ జిల్లా కోర్టు ప్రాంగణాల్లో న్యాయవాదులు బతుకమ్మ వేడుకలను ఎంతో ఉత్సాహంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వి. బి. నిర్మల గీతంబ, యం. ఆర్. సునీత, అదనపు న్యాయమూర్తులు మరియు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఉపేందర్, రామకృష్ణ పాల్గొన్నారు. మహిళా న్యాయవాదులు పూల బతుకమ్మలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సంబరాలను జరుపుకున్నారు.