Sep 16, 2026, 01:09 IST/
100 రోజులైన వీడని జ్ఞానేశ్వరి మిస్టరీ!
Sep 16, 2026, 01:09 IST
AP: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్.అగ్రహారంలో జూన్ 6న పామాయిల్ తోటలో ఆడుకుంటూ అదృశ్యమైన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసులో వంద రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నా ఎలాంటి క్లూ లభించలేదు. కిడ్నాప్, అడవి జంతువుల దాడి వంటి కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు, కేసు వివరాలతో హైకోర్టుకు నివేదిక సమర్పించారు. అయినా, జ్ఞానేశ్వరి ఎక్కడుంది? ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లభించలేదు.