
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 317 వెంటనే అమలు చేయాలి
జనగామలో టీఎంఎస్టీఏ జిల్లా అధికార ప్రతినిధి గణేష్ కందగట్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపై శుక్రవారం స్పందించారు. దసరా సెలవుల్లోనే 317 జీఓ అమలు, వేతనాలను 010 పద్దు కింద చెల్లించడం, పీజీటీలను జెల్స్ గా అప్గ్రేడ్ చేయడం వంటి పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వీటితో పాటు 2013 నుంచి పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు, మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.




































