జనగాం మండలం - Janagam Mandal

ఉమ్మడి వరంగల్ జిల్లా
నర్సంపేట ఎమ్మెల్యే నీ  మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో
Sep 26, 2026, 12:09 IST/నర్సంపేట
నర్సంపేట

నర్సంపేట ఎమ్మెల్యే నీ మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో

Sep 26, 2026, 12:09 IST
వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి, ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటించి, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలిసి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి వరకు చేరేలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా TNGO'S యూనియన్ అధ్యక్షులు వేణుగోపాల్, నాయకులు పాల్గొన్నారు.