
మహబూబాబాద్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
మహబూబాబాద్ పట్టణంలోని 16వ వార్డు రాహుల్ నగర్లో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ శంకుస్థాపన చేశారు. కౌన్సిలర్ బానోత్ పద్మ సీతారాం నాయక్ విజ్ఞప్తి మేరకు, మున్నేరు వాగు సమీపంలో బతుకమ్మ ఘాట్ మరియు స్మశానవాటిక పనులు త్వరలో చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య పాల్గొన్నారు.



































