మహాదేవపూర్ మండలం - Mahadevpur Mandal

ఉమ్మడి వరంగల్ జిల్లా
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ
Sep 14, 2026, 12:09 IST/జనగాం
జనగాం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ

Sep 14, 2026, 12:09 IST
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్, రంగుల విగ్రహాల వాడకాన్ని తగ్గించాలని లయన్స్ క్లబ్ జఫర్గడ్ చార్టర్ ప్రెసిడెంట్ మామిడాల పూర్ణచందర్ సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, జనగాంలో ఉచిత మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్నిసోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అంచు యుగంధర్, మార్కెటింగ్ కోఆర్డినేటర్ భువనగిరి శ్రవణ్ కుమార్, డైరెక్టర్ పాలకుర్తి నాగార్జున, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ మంచాల ఎల్లయ్య, జాయింట్ సెక్రెటరీ దాంశెట్టి సోమేశ్వర్, లియో కోఆర్డినేటర్ బైరి వెంకటేశ్వర్లు, మాస్టర్ చైర్మన్ ఎదులాపురం మదన్మోహన తదితరులు పాల్గొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్, రసాయన రంగులతో కూడిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలనే వాడాలని అవగాహన కల్పించారు.