Oct 09, 2026, 18:10 IST/పరకాల
పరకాల
ఆరెపల్లి హవేలీలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు
Oct 09, 2026, 18:10 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలోని గీసుకొండ మండలం ఆదర్శ గ్రామమైన ఆరెపల్లి హవేలీలో బొడ్డెమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పెద్దలు, చిన్నారులు సాంప్రదాయక పద్ధతిలో బొడ్డెమ్మను పేర్చి ఆటపాటలతో, కోలాటాలతో పాటలు పాడారు. అనంతరం బ్యాంక్ వారి బావిలో బొడ్డెమ్మను నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో సర్పంచి స్వప్న కూడా పాల్గొన్నారు. మహిళలు 'వెళ్లి మళ్లీ రా' అంటూ శ్లోకాలు వినిపించారు.