
తాడ్వాయి బిఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టును ఖండించిన నాగ రమేష్
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ప్రవళిక, పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. వారి అరెస్టుకు నిరసనగా వారికి మద్దతుగా బయలుదేరిన బి ఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాడిస నాగ రమేష్ ని మార్గమధ్యలో పోలీస్ లు ఆపి వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా నాగరమేష్ మాట్లాడుతూ ఇది హేయమైన చర్య అని, ప్రశ్నిస్తే ఇలా జైల్లో వేస్తారా భారత పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని పార్టీ నాయకుల అక్రమ అరెస్టును ఖండించారు.



































